Friday, October 26, 2007

Subhodayam - Natanam Aadene

naTanam aaDenE from the movie Subhodayam is a classical composition about taanDava, the dance of Shiva. Penned by Dr. Veturi Sundararama Murthy, this song is set to Amruthavarshini by K.V.Mahadevan and sung by P.Suseela and S.P.Balu



Note: Best viewed in I-Explorer

నటనం ఆడెనే
నటనం ఆడెనే భవతిమిర హంసుడా పరమ శివుడు నటనావతంశుడై
తకథిమి తకయని

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి
విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే

Listen to the Song here :

|
|



శివ గంగ శివమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా
హరిహరాత్మకమగుచు అఖిల ప్రపంచంబు
గరుడ నాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే

వసుధ వసంతాలాలపించింగా
సురలు సుధను ధరలో కురిపించగా
రతి మన్మథులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా
నటనం ఆడెనే

Wednesday, August 15, 2007

Gangotri...







One of the best compositions of M.M.Keeravani, the title song of "Gangotri", ace director K.Raghavendra Rao's 100th film.....written by Dr.Veturi and sung by Keeravani himself....this song has three different ragas...amruthavarshini, pantuvarali and hamsanandi.....amruthavarshini is a perfect selection for the song associated with the mighty Ganges!!

Note: Best viewed in I-Explorer

ఓం...ఓం....ఓం....ఓం...
జీవన వాహినీ.....పావనీ...

కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరుములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగా దేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి
గంగోత్రీ....గంగోత్రీ...

గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...

జీవన వాహినీ...పావనీ...



Listen to the Song here :








మంచు కొండలో ఒక కొండ వాగులా...ఇల జననమొందిన విరజా వాహినీ

విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా...శివ గిరికి చేరినా సుర గంగ నీవనీ

అత్తింటికి సిరులనొసగు అలకనందవై...
సగర కులము కాపాడిన భాగీరథివై...
బదలీవన హృషీకేష హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి...

గంగోత్రీ....గంగోత్రీ....

గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...

జీవన వాహినీ...పావనీ...

పసుపు కుంకుమతో...పాలు పన్నీటితో...శ్రీగంధపు ధారతో...
పంచామృతాలతో....
అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ....
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం...

అమ్మా...గంగమ్మా....
కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనాకడొద్దని
గోదారికి కావేరికి ఏటికి సెలYఏటికీ కురిసేటీ జడి వానకీ దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ...చెప్పమ్మా మా గంగమ్మా....





జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా....
పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా...
శివుని జటలనే తన నాట్య జతులుగా...
జలకమాడు సతులకు సౌభాగ్య దాత్రిగా...

గండాలను పాపాలను కడిగి వేయగా..
ముక్తి నదిని మూడు మునకలే చాలుగా...
జల దీవెన తలకు పోసే...జననీ గంగా భవాని...
ఆమే అండ మంచు కొండ...వాడని సిగ పూదండ...

గంగోత్రీ....గంగోత్రీ....

గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...

జీవన వాహినీ...పావనీ...

Chilipi chilaka




Written by Dr.Veturi Sundararama Murthy from the movie "Allari Premikudu"....composed by M.M.Keeravani...this song is in Amruthavarshini raagam....
Infact the sahityam part of this song has many english and hindi words....yet SPB and Chitra elevate that soft romatic feel in the song...a very good example for Veturi's word-play!!

Note: Best viewed in I-explorer


చిలిపి చిలక I Love You అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలకపచ్చ పైటకీ కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం

సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలికి వయ్యారాల ఒంపు...
ఆ....కబురు పంపు......ఆ....గుబులు చంపు
వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోశాక వయసు గోదాట్లోకి దింపు...
ఆ....మరుల గుంపు....ఆ.....మగువ తెంపు
అహో ప్రియ మహోదయ...లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి చెలి సఖి చలావో
ఈ వసంత పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో మోజుపడ్డ కాముడో ఇచ్చాడమ్మా తీయని జీవితం...

Listen to the Song here :








నీలాల మబ్బుల్లో నీళ్ళోసుకున్నాక మెరిసందిలే చుక్క రూపు...
ఆ....కలల కాపు....ఆ....కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వేట్టి పోయాక తెలిసంది పిల్లాడి ఊపు...
ఆ....చిలిపి చూపు....ఆ....వలపు రేపు
వరూధిని సరోజిని ఏదే కులు మనాలి...
ప్రియ ప్రియ హిమలయ వరించుకోమనాలి...
కోనసీమ కోకమడతలా
చిగురాకు రైక ఎత్తుపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో కొంగుపల్లి జబ్బరు...నచ్చిందమ్మా అమ్మడి వాలకం...

Friday, May 05, 2006

Ghallu Ghallu



An amazing song written by Sri Seetarama Sastry gaaru, tuned by Ilayaraja and sung by Suseela and SPB...this song goes in the theme of a debate between the traditional and modern views in the form of questions.....

Note: Best viewed in I-explorer.



ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
వెల్లువచ్చి సాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు

||ఘల్లు||

Listen to the Song here :








లయకే నిలయమై నీ పాదం సాగాలి...
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి...
వలలో వొదుగునా విహరించే చిరుగాలి?
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి??
తిరిగే కాలానికి తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సుర గంగకు విలువేముంది
విలువేముంది??

||ఘల్లు||

దూకే అలలకు ఏ తాళం వేస్తారు?
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?
అలలకు అందునా ఆశించిన ఆకాశం?
కలలా కరగటమా జీవితాన పరమార్థం?
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది
విలువేముంది??

||ఘల్లు||

Monday, November 14, 2005

Kurisenu Virijallule



Note:Best viewed in I-explorer browser!!

A song from Gharshana written by vETuri n sung by vaaNi jayarAm

కురిసేను విరి జల్లులే...ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావే

Listen to the Song here :

Get this widget | Track details | eSnips Social DNA


ఆకుల పై రాలు ఆ..ఆ...
ఆకులపై రాలు హిమబిందువు వోలె..నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు..చెలికడిని ఎడ చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం ఆ..


కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు..వన్నెల మురిపాల కథ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో..ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన..మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి..మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ..


Note:Listen to this song...the aalap "aa.." is so beautifully rendered to a perfect amruthavarshini.....

Aanati neeyaraa....haraa.....




Note:Best Viewed in I-explorer browser!



Written by Sri Sirivennela Seetarama Sastry garu and sung by Smt Vani Jayaram garu.....a song in amruthavarshini.....


ఆ..
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా


నీ ఆన లేనిదే రచింప జాలునా వేదాల వానితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతీి క్షణం పశుపతి నీ అధీనమై
కదులును గా సదా సదాశివ

ఆనతి నీయరా హరా

ని-ని-స-ని-ప-ని-ప-మ-గ-స-గ

ఆనతి నీయరా

అచలనాథ అర్చింతును రా

ఆనతి నీయరా

పమ-పని-పమ-పని-పమ-పని-గమ-పని
సని-సగ-సని-సగ-సని-సగ-పని-సగ
గమగసా-నిపమ-గమగస-మగసని

ఆనతిి నీయరా

జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడర
సాష్టాంగమున దండమూ సేతురా

ఆనతి నీయరా

సానిప-గమ-పానిపమ
గమగ పప పప
మపని పప పప
గగమ గస సస
నిసగ సస సస
సగ గస గప పమ పస నిస
గసని సగ సగ
సని సగ సగ
పగ గగ గగ
సని సగ గ
గసగ గ
పమ గస గ మ స ని పనిపమగమగ


Listen to the Song here :









ఆనతి నీయరా

శంకరా శంకించకురా
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా

ఆనతి నీయరా

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స గ మ
పప పమప నినిపమగస గగ

గమపని గా
మపనిస మా
పనిసగ ని స ప ని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గగా

గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా

గామపని గమాపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా గ గా

గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా

రక్షా వర శిక్షా దీక్ష ద్రక్ష
విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక
పరీక్ష సేయక రక్ష రక్ష యను ప్రార్థన వినరా

ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర
దొర సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా

Monday, October 24, 2005

Sirivennela



A bit from the song
ee gaali ee nEla
Listen to the Song here :


|
|


kanne mooga manasukanna swarNaswapnamai
taLukumanna taara chiluku kaantidhaaralai
gaganagaLamu nunDi amaragaana vaahini
jaaluvaarutOndi ilaa
amRtavarshiNii......amRtavarshiNii.....amRtavarshiNii.....


కన్నె మూగ మనసుకన్న స్వర్ణస్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతిచినుకులై
గగనగళము నుండి అమర గానవాహిని
జాలువారుతుంది ఇలా
అమృతవర్షిణి......అమృతవర్షిణి.....అమృతవర్షిణి....

Amruthavarshini....



A raaga that is highly soothing to ears....
A raaga that makes clouds rain heavily....
A raaga that makes ur heart fill with joy...
Amrutha-Nectar Varshini-Rain......
A Rain of Amrutham(Nectar).......
That is Amruthavarshini for u......
---------------------------------------------
Well....I luv Indian Classical Music esp the Carnatic Saili and I have a special admiration for this raagaa Amruthavarshini....though I have never learnt Music to speak much about it...this catchy raaga pulled me to its feet....thts its greatness....
And I would be using this Blog to publish all the songs I know in this raaga mostly the semi-classical Telugu Filmi Songs....So ENJOY the sweet nectar of AMRUTHAVARSHINI...