Ghallu Ghallu

An amazing song written by Sri Seetarama Sastry gaaru, tuned by Ilayaraja and sung by Suseela and SPB...this song goes in the theme of a debate between the traditional and modern views in the form of questions.....
Note: Best viewed in I-explorer.
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
వెల్లువచ్చి సాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
||ఘల్లు||
Listen to the Song here :
|
లయకే నిలయమై నీ పాదం సాగాలి...
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి...
వలలో వొదుగునా విహరించే చిరుగాలి?
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి??
తిరిగే కాలానికి తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సుర గంగకు విలువేముంది
విలువేముంది??
||ఘల్లు||
దూకే అలలకు ఏ తాళం వేస్తారు?
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?
అలలకు అందునా ఆశించిన ఆకాశం?
కలలా కరగటమా జీవితాన పరమార్థం?
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది
విలువేముంది??
||ఘల్లు||
5 Comments:
Bhaanupriya chakkaga vundi..!!!
nice pic!
Bhanupriya chaalaa divine gaa kanipistOndi ee pic-lO, like Aruna also said. Song-lO oka 2-3 mistakes unnaayi script-lO. (ఒళ్ళు, ఒదుగునా, వెల్లువొచ్చి) kudiritE correct them when you can. I really appreciate your presenting great songs here! :)
Hi karthik...its a splendid work u have done here.I was not very much satisfied with your previous page as it had black backgrnd and there were no pictures at all.
now that u have modified your page,it really turned to an eye catching one.
way to go pal!!!
Idi (overused) Hindolam, just for your info!
wow..nijamgane variety blog..ee patalu ante naku chala ishtamm..but ivi ee raagam oo aa sangeeta gyanam naku ledu..
kontha mandi cheppinatlu bhanupriya chooda muchata ga undi
Post a Comment
<< Home