Gangotri...One of the best compositions of M.M.Keeravani, the title song of "
Gangotri", ace director K.Raghavendra Rao's 100th film.....written by Dr.Veturi and sung by Keeravani himself....this song has three different ragas...
amruthavarshini,
pantuvarali and
hamsanandi.....
amruthavarshini is a perfect selection for the song associated with the mighty Ganges!!
Note: Best viewed in I-Explorer
ఓం...ఓం....ఓం....ఓం...
జీవన వాహినీ.....పావనీ...
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరుములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగా దేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి
గంగోత్రీ....గంగోత్రీ...
గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...
జీవన వాహినీ...పావనీ...
Listen to the Song here :
మంచు కొండలో ఒక కొండ వాగులా...ఇల జననమొందిన విరజా వాహినీ
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా...శివ గిరికి చేరినా సుర గంగ నీవనీ
అత్తింటికి సిరులనొసగు అలకనందవై...
సగర కులము కాపాడిన భాగీరథివై...
బదలీవన హృషీకేష హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి...
గంగోత్రీ....గంగోత్రీ....
గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...
జీవన వాహినీ...పావనీ...
పసుపు కుంకుమతో...పాలు పన్నీటితో...శ్రీగంధపు ధారతో...
పంచామృతాలతో....
అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ....
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం...
అమ్మా...గంగమ్మా....
కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనాకడొద్దని
గోదారికి కావేరికి ఏటికి సెలYఏటికీ కురిసేటీ జడి వానకీ దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ...చెప్పమ్మా మా గంగమ్మా....
జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా....
పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా...
శివుని జటలనే తన నాట్య జతులుగా...
జలకమాడు సతులకు సౌభాగ్య దాత్రిగా...
గండాలను పాపాలను కడిగి వేయగా..
ముక్తి నదిని మూడు మునకలే చాలుగా...
జల దీవెన తలకు పోసే...జననీ గంగా భవాని...
ఆమే అండ మంచు కొండ...వాడని సిగ పూదండ...
గంగోత్రీ....గంగోత్రీ....
గల గల గల గంగోత్రి...హిమగిరిదరి హరిపుత్రి...
జీవన వాహినీ...పావనీ...